భారతదేశ రవాణా రంగంలో ఓ కీలక మైలురాయి నమోదు అయింది. ఢిల్లీ–గురుగ్రామ్ మధ్య 56 కిలోమీటర్ల పొడవున సాగే ద్వార్కా ఎక్స్‌ప్రెస్‌వే పై దేశంలో తొలిసారిగా AI ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలులోకి వచ్చింది. ఇకపై ఈ మార్గాన్ని దాటి వెళ్ళేవారు, సీట్‌బెల్ట్ వేయకపోవడం, లైన్ జంప్ చేయడం, స్పీడ్ క్రాస్ చేయడం లాంటి 14 రకాల ఉల్లంఘనలపై సాంకేతిక నిఘా ఎదుర్కోవలసి ఉంటుంది.
ఈ కొత్త వ్యవస్థ క్యామెరాల ద్వారా వాహనాల డేటాను సేకరించి, AI ద్వారా విశ్లేషిస్తుంది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తూ, డ్రైవర్ల భద్రతను పెంపొందించేందుకు సహాయపడుతుంది.
ఇంతకముందు ఇదంతా మానవ నిఘా మీద ఆధారపడితే, ఇకపై ఆటోమేటెడ్ వ్యవస్థ వలన ప్రమాదాలు తగ్గుతాయి, జరిమానాలు ఖచ్చితంగా అమలు అవుతాయి, అని అధికారుల అభిప్రాయం. NHAI ఈ చర్యను భవిష్యత్తు భారత రోడ్డు వ్యవస్థలో ఒక నమూనాగా నిలుపనుందని ప్రకటించింది.
ఇలా ఈ పరిష్కారం మన దేశంలో రవాణా భద్రతకే కాక, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధికి కూడా చిహ్నంగా మారింది.